TS: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జిఒ రద్దు: హైకోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జిఒను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సెక్షన్ 10ఎ ప్రకారం తీసుకొచ్చిన జిఒ 16ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే , నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం జిఒను దర్దు చేస్తూ తీర్పునిచ్చింది.
రాష్ట్రంలో ఇక నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులను తొలగించ వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని తెలిపింది.