వచ్చే నెల 5 వ తేదీ నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్ ల రద్దు
సికిందరాబాద్ (CLiC2NEWS): నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్దిరోజుల పాటు సికిందరాబాద్ – పుణెల మద్య నడిచే గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు ద.మ. రైల్వే లోని విజయవాడ డివిజన్‌లో మూడు లైన్లు పనుల కారణంగా రైళ్లను కొంతకాలం నిలిపి వేయనున్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు..
- పుణె – సికిందరాబాద్ (12205) శాతాబ్ది ఎక్స్‌ప్రెస్ జులై 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో రద్దయింది.
- సికిందరాబాద్- పుణె (12206) శాతాబ్ది ఎక్స్‌ప్రెస్ జులై 29, 31 తేదీల్లో రద్దయింది.
- సికిందరాబాద్- ముంబయి ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్ (12220) జులై 30,
ముంబయి – సికిందరాబాద్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్ (12219) జులై 31న రద్దయింది. - నిజామాబాద్ – పుణె (11410) ఎక్స్‌ప్రెస్ 31వ తేదీన రద్దయింది.
- విజయవాడ – భద్రాచలం రోడ్ (07979),
భద్రాచలం రోడ్ – విజయవాడ (07278),
డోర్నకల్ – విజయవాడ (07755),
విజయవాడ – డోర్నకల్ (07756) రైళ్లు ఆగస్టు 5వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు రద్దయ్యాయి. - విజయవాడ – సికిందరాబాద్ (12713), సికిందరాబాద్ – విజయవాడ (12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్…
గుంటూరు -సికిందరాబాద్ (17201), సికిందరాబాద్ – గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లు ఆగస్టు 5 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు రద్దయ్యాయి. - హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) తో పాటు సికిందరాబాద్ – విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి, సికిందరాబాద్ – తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికిందరాబాద్ – గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్- తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లు దారి మళ్లించి నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.