రానున్న ఐదారు నెలల్లో అందుబాటులోకి కాన్సర్ టీకా.. కేంద్రమంత్రి

ఛత్రపతి శంభాజి నగర్ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా క్యాన్సర్‌చే పీడించబడుతున్న వారు ఎక్కువవుతున్నారు. మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కునేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. ఆయన మంగళవారం ఛత్రపతి శంభాజి నగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కాన్సర్ రోగులు ఎక్కువవుతున్నందున , ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా 30 ఏళ్లు దాటిన మహిళలకు ఆసుపత్రులలో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
క్యాన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసిందని తెలిపారు. అందుబాటులోకి రాబోయే ఈ టీకా రొమ్ము , నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని.. టీకా వేసుకునేందుకు 9 నుండి 16 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. అంతేకాక, ఆసుపత్రులలో ఆయుష్ విభాగాలు ఉన్నాయని, ప్రజలు సౌకర్యాలను వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.