న‌గ‌రంలో ప‌ట్టుబ‌డ్డ గంజాయి చాక్లెట్స్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో భారీగా గంజాయి చాక్లెట్స్ ప‌ట్టుబ‌డ్డాయి. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుండి న‌గ‌రానికి త‌ర‌లిస్తున్న గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్ల‌ను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. వీకెండ్ పార్టీల‌పై ఎక్సైజ్ పోలీసుల‌తో క‌లిపి డిటిఎఫ్ బ‌ల‌గాలు సోదాలు నిర్వ‌హిస్తున్న క్ర‌మంలో ఓవ్య‌క్తి బైక్‌పై గంజాయి చాక్లెట్స్‌ను త‌ర‌లిస్తున్నాడు. అత‌నిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌ని వద్ద ఉన్న రూ. 7 ల‌క్ష‌లు విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆర్‌టిసి బ‌స్సుల్లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న సుమారు. రూ. 60 ల‌క్ష‌ల విలువ చేసే 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.