ప్రాంతీయ భాషల్లో సిఎపిఎఫ్ కానిస్టేబుల్ పరీక్షలు.. కేంద్ర హోంశాఖ నిర్ణయం
ఢిల్లీ (CLiC2NEWS): సిఎపిఎఫ్ కానిస్టేబుల్ రాత పరీక్షలు ఇక నుండి తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో సిఎపిఎస్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషలలో నిర్వహించేవారు. ప్రాంతీయ భాషలో రాత పరీక్ష నిర్వహించాలని పలు రాష్ట్రాల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఈ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
సిఎపిఎఫ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్, సశస్త్ర సీమా బల్, నేషనల్ సెక్యూరిటీ గార్డు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పోస్టులు ఉన్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ ఈ నియామక పరీక్షలను అస్సీమీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, ఉర్దూ, ఒడియా, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో నిర్వహించనున్నట్లు నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువకులు తమ సొంత భాషల్లో పరీక్ష రాసి, తమ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవడానికి వీలవుతుంది.
అమిత్‌షాకు కెటిఆర్ ధన్యవాదాలు
సిఎపిఎఫ్ పరీక్షలను ప్రాంతీయ భాషలలో నిర్వహించేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వంకు తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
తమిళంపై వివక్ష చూపద్దు.. కేంద్ర హోంమంత్రికి స్టాలిన్ లేఖ