విశాఖను ఆర్దిక రాజధానిగా చేస్తాం: సిఎం చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): ఎపిలో రాజధాని నిర్మాణ పనలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. గతంలో రూ. 160కోట్ల తో ఏడంతస్తుల భవనంలో సిఆర్‌డిఎ ఆఫీసు పనులను ప్రారంభించి కార్యక్రమాన్ని మెదలు పెట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద భవన ప్రాంగణంలో సిఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో నిర్మాణ పనుల జెట్ స్పీడ్‌తో జరగాలన్నారు. అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించిందని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై , అమరావతి మీదుగా బుల్లెట్ రైలు రావాలని, బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి .. రాష్ట్రానికి మధ్యంలో ఉండే ప్రాంతం. ఒక రాష్ట్రం , ఒక రాజధాని అని.. ప్రతి చోటా చెప్పాను. విశాఖను ఆర్ధిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని సిఎం వెల్లడించారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని, చరిత్ర తిరగరాసేందుకు మనమంతా ఇక్కడ సమావేశమయ్యామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మాదేనని, ముందుచూపుతో 8 వరుసల రోడ్లు వేశామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారు. అమరావతి రైతులను ఒప్పించి భూమిని సేకరించామని, రాజధాని, సమాజ హితం కోసం భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారని తెలిపారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించాం. మహిళా రైతులు వైఎస్ ఆర్‌సిపి ప్రభుత్వం మీద గట్టిగా పోరాడారని సిఎం తెలిపారు.