AP: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
గుంటూరు (CLiC2NEWS): గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసెకెళ్లింది. ఈప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళగిరి మండలం, ఎర్రబాలెం చెరువు మలుపు వద్ద కారు అదుపుతప్పడం వలన ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి కారు అద్దాలు పగులగొట్టి నలుగురిని బయటకు తీశారు.. కానీ వారు అప్పటికే మృతిచెందారు. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.