వ‌న‌ప‌ర్తి జిల్లాలో కారు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

కొత్త‌కోట (CLiC2NEWS): వ‌న‌ప‌ర్తి జిల్లాలోని కొత్త‌కోట ప‌రిధి జాతీయ రాహ‌దారిపై కారు ప్ర‌మాదానికి గురైంది. క‌ర్ణాట‌కలోని బ‌ళ్లారి నుండి హైద‌రాబాద్ వెళుతున్న కారు అదుపుత‌ప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులు స‌హా ఐదుగురు మృతి చెందారు. మ‌రో ఏడుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో 12 మంది ఉన్నారు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జ‌యింది. సిబ్బంది గంట‌కుపైగా శ్ర‌మించి కారులో ఇరుక్కుపోయిన మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.