మద్యం మత్తులో కారు నడిపిన యువకులు: ముగ్గురు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/CAR-ACCIDENT-IN-VIZAG-BEECH-ROAD.jpg)
విశాఖ (CLiC2NEWS): మద్యం మత్తులో కొంత మంది యువకులు కారు నడిపి యువ దంపతులతో సహా ఒక యువకుడు మరణానికి కారణమయ్యారు. విశాఖ-భీమిలి మామార్గంలో రాడీసన్ హోటల్ మలుపు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం చెట్టును ఢీకొట్టి అవతలివైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది .బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి తీవ్రగాయాలు అవటంతో ప్రాణాలు కోల్పోయాడు. కారులోని మరో ముగ్గురు పరారైనట్లు సమాచారం. ప్రమాదానికి గురైన కారులో ఆరుగురు యువకులు ఉన్నారు.
కారులో మృతి చెందిన మణికుమార్ డిప్లమో చేశాడు. అతని తండ్రి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుంటారు.