Hyderabad: కారు, టిప్పర్ ఢీ.. హెడ్‌కానిస్టేబుల్ మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/sham-police.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కూకట్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత కేపీహెచ్‌బీ బ్రిడ్జిపై టిప్పర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారని తెలిపారు. మృతుడిని ఈశ్వరయ్యగా గుర్తించారు. ఆయన శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.