సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమదైంది. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు చేయిచేసుకున్నారు. ఈ క్రమంలో ఆయనపైకేసు నమోదైంది. ముందుగా ఆయనపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు కాగా.. తాజాగా లీగల్ ఓపీనియన్ తీసుకున్న పోలీసులు అయనపై 109 కిందకేసు నమోదు చేసినట్లు సమాచారం.
జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద గత కొన్ని రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం ఆయన నివాసానికి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. వారిని మోహన్‌బాబు బౌన్సర్లు , సహాయకులు అడ్డుకున్నారు. గేటు లోపల ఉన్న వారిని బయటకు తోసి ,కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం మోహన్‌బాబు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో ని మైక్‌ను లాక్కొని ఆతని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానెల్ కెమెరామెన్ కింద పడిపోవడం జరిగింది. దీంతో మోహన్‌బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Comments are closed.