మాజి మంత్రి కెటిఆర్‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్ (CLiC2NEWS):  ఫార్ములా-ఇ కార్ రేసు కేసులో మాజి మంత్రి , బిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌పై కేసు న‌మోదైంది. ఫార్మాలా-ఇ కార్ రేసు వ్య‌వ‌హారంలో ఎ1గా కెటిఆర్, ఎ2గా ఐఎఎస్ అర్వింద్ కుమార్ ఎ3గా హెచ్ ఎండిఎ చీఫ్ ఇంజినీర్ బిఎల్ ఎన్ రెడ్డిపై తెలంగాణ ఎసిబి కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో కెటిఆర్‌పై విచార‌ణ జ‌రిపేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అనుమ‌తి ఇవ్వ‌డంతో త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం ఉప‌క్ర‌మించింది.

2023 ఫిబ్ర‌వ‌రి 10. 11 తేదీల్లో నెక్లెస్ రోడ్డులో ఫార్ములా-ఇ రేస్ 9వ సీజ‌న్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి మంత్రి కెటిఆర్ ఆమోదంతో ఫార్మాలా – ఇ ఆప‌రేష‌న్స్ ,ఎస్ నెక్ట్స్ జెన్‌, పుర‌పాల‌క శాఖ‌ల మ‌ధ్య 9, 10, 11, 12వ సీజ‌న్ల కార్ రేస్‌లు నిర్వ‌హించేలా ఒప్పందం కుదిరింది. ఈ రేసు నిర్వ‌హించిన విదేశీ సంస్థ‌కు హెచ్ ఎండిఎ బోర్డు, ఆర్ధిక శాఖ‌, ఆర్‌బిఐల అనుమ‌తి తీసుకోకుండానే నేరుగా రూ. 55 కోట్లు చెల్లించ‌డం, ముఖ్యంగా రూ.46 కోట్లు వ‌ర‌కు డాల‌ర్లు రూపంలో చెల్లించార‌నే అభియోగం ఉంది. దీనిపై పుర‌పాల‌క శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ఫిర్య‌దు చేయ‌గా.. ఎసిబి కేసు న‌మోదు చేసింది. దీనిలో కెటిఆర్‌తో పాటు పుర‌పాల‌క శాఖ అప్ప‌టి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా చేర్చారు. కెటిఆర్ పై కేసు న‌మోదుకు గ‌వ‌ర్న‌ర్ నుండి అనుమ‌తి కోర‌గా.. సుమారు నెల రోజుల త‌ర్వాత అనుమ‌తి ల‌భించింది.

Leave A Reply

Your email address will not be published.