పంజాబ్‌లో సోనూ సూద్‌పై కేసు నమోదు..!
చండీగడ్ (CLiC2NEWS): బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఎన్నికల నిబంధనలు ఉల్లఘించారంటూ పంజాబ్‌లోని మోగా జిల్లాలో కేసు నమోదైంది. పోలింగ్ రోజున సోనూ సూద్ ఆయన సోదరి తరపున ప్రచారం నిర్వహించారన్న ఆరోపణలపై పోలీసులు ఎఫ్ ఆర్ ఐ నమోదు చేశారు. సోనూసూద్ సోదరి మాళవిక సూద్ పంజాబ్‌లోని మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. గత ఆదివారం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి. పోలింగ్ రోజున తన సోదరి తరపున ప్రచారం చేస్తున్నారంటూ పోలీసుకలు ఫిర్యాదు అందింది. సోనూసూద్ కారులో కూర్చుని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్ల మోగా పోలీసులు తెలిపారు.
సోనూసూద్ఈ ఆరోపణలను ఖండించారు. విపక్షల నుండి పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు బెరిరింపులు వచ్చినట్లు తెలిసింది. కొన్ని కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం వచ్చింది. ఆ విషయం తెలిసే ఇంటి నుంచి బయటకు వచ్చాను అని అన్నారు.