అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలో న‌గ‌దు జ‌మ‌: ముఖ్య‌మంత్రి జగన్

తాడేపల్లి (CLiC2NEWS): అగ్రిగోల్డ్ బాధితుల ఖాల్లో సిఎం జ‌గ్ న‌గ‌దు జ‌మ చేశారు. ఎన్నికలప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆంధ్ర‌ప్రదేశ్ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని సిఎం జగన్ అన్నారు.

2019 నవంబర్‌లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు, 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేశామని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.