క్యాట్‌ను ఆశ్రయించిన ఐఎఎస్ అధికారులకు చుక్కెదురు

ఢిల్లీ (CLiC2NEWS): ఎపికి వెళ్లాల్సిన ఐఎఎస్ అధికారులు తెలంగాణలోనే కొనసాగేందుకుగాను కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం వారి పిటిషన్లపై విచారణ జరిపిన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎపిలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి సేవ చేయాలని మీకు లేదా అని ప్రశ్నించింది. ఐఎఎస్ కేటాయింపులపై డిఒపిటికి పూర్తి అధికారాలు ఉన్నాయని.. స్థానికత ఉన్నప్పటికి స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా.. అని క్యాట్ ప్రశ్నించింది. కేంద్ర ఇచ్చిన డిఒపిటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఎపికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ .. వీరు ఎపికి వెళ్లాల్సి ఉంది. ఎపిలో కొనసాగుతున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. వీరు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే కొనసాగేలా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలని క్యాట్‌ను ఆశ్రయించారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థలను పరిగణలోకి తీసుకోలేదని.. డిఒపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
[…] క్యాట్‌ను ఆశ్రయించిన ఐఎఎస్ అధికారు… […]