చిట్టాగాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు
చిట్టాగాంగ్ (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టాగాంగ్‌లో కాదమ్రసుల్ ప్రాంతంలో కంటైనర్ డిపోలో భారీపేలుడు సంబంవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 40 మంది మరణించినట్లు సమాచారం. వారిలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో 300 మందికి పైగా గాయపడ్డారు. మంటలను అదుపు చేస్తూ 40 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. 10 మంది పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులతో సమీపంలోని ఆసుపత్రులు నిండిపోయాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు చాలా మందికి 60 నుంచి 90 శాతం వరకూ కలిన గాయాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కాగా పెలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. భారీ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. శిథిలాలు కిలోమీటర్ల దూరంలోని ఇళ్లపై కూడా పడ్డాయి. మంటలు కొన్ని గంటలైనా అదుపులోకి రాకపోవడంతో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.