గుండెపోటు రావ‌డానికి గ‌ల కారణాలు, నియ‌మాలు

గుండెపోటు ఎక్కువ రావటానికి కారణం, శారీరకశ్రమ లేకపోవటం,శారీరక శ్రమ ఎక్కువగా చేయటం, వ్యాయామం లేకపోవటం, అధిక వ్యాయామం చేయటం, నియమ నిబంధనలు లేకుండా విచ్చల విడిగా తినటం, రాత్రి నిద్ర తక్కువ పోవటం, పగలు ఎక్కువగా నిద్రపోవటం, మరియు software job చేసేవారికి, పోలీస్ ఉద్యోగం చేసేవారికి, factories లో నైట్ షిఫ్ట్ duty చేసేవారికి, భారీ వాహనములు నిద్ర లేకుండా నడిపేవారికి, వంట మాస్టర్స్ కి, tea, కాఫీ లు ఎక్కువగా తాగేవారికి,ఎక్కువగా జంక్ food తినటం,పిజ్జా, బర్గర్, పిస్తా, నూడిల్స్, స్నాక్స్, ఆలు చిప్స్,గప్ చుప్ తినటం,కూల్డ్రింక్స్ ,ఆల్కహాల్ తాగటం, pan పరాగ్, గుట్కా, జర్దా తినటం వలన నోటిలో లాలజాలం medicine గా పనిచేయాల్సింది, ఇన్ఫెక్షన్ గా విషమంగా మారటం, పొగాకు నమలటం వలన మలబద్ధకం రావటం దీని వలన గ్యాస్ ఉత్పత్తి అవ్వటం చాతి కింద, ఛాతి వెనుక భాగం వీపులో నొప్పి రావటం జరుగుతుంది.

స్మోకింగ్ చేయటం, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ ఎడమ చేతిలో పట్టుకొని గంటలు గంటలు చాటింగ్ చేయటం, దానితో మెడ నొప్పి రావటం, చేతులు గుంజటం, ఎక్కువ సేపు కూర్చోని ఫోన్‌ ఆడటం వలన గ్యాస్ ఎక్కువై అది ఛాతి దగ్గర నొప్పి రావటం, దాని ప్రభావం గుండె మీద పడి గుండె నొప్పి వచ్చినట్లు, గుండెలో సూదులు గుచ్చినట్లు అనిపించటం జరుగుతుంది.

చికెన్, మటన్, ఎక్కువగా తినటం వలన రక్తంలో LDL చెడు కొలెస్ట్రాల్,VLDL, Triglycerides గా మారటం రక్త నాళాలు కొవ్వుతో మూసుకొని పోయి గుండె పోటు రావటం జరుగుతుంది.(ముఖ్యంగా షుగర్, బీపీ,age, family problem,అధిక బరువు,వంశపారపర్యం, మానసిక ఒత్తిడి, ఏదైనా దీర్ఘకాలిక మెడిసిన్స్ వాడటం, ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్ధికంగా ఇబ్బందులు,కూడా పరిగణలోకి తీసుకోవాలి.) కనుక గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ప్ర‌తి రోజూ యోగా చెయ్యాలి, వాకింగ్, రన్నింగ్ విలునిబట్టి శరీరానికి వ్యాయామం ఇవ్వాలి. చక్కని ఆహారనియమాలు పాటించాలి.దినచర్య, రాత్రిచర్య, రూతుచర్య, పాటించాలి. ఆహారమే ఔషదంగా మార్చుకోవాలి,అప్పుడే గుండెపోటు రాకుండా చూసుకోగ‌ల‌ము.

-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు

 

Leave A Reply

Your email address will not be published.