మంత్రి గంగుల నివాసానికి సిబిఐ అధికారులు!

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): సిబిఐ అధికారులు రాష్ట్ర మంత్రి గంగుల క‌మలాక‌ర్ నివాసానికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో మంత్రి ఇంట్లో లేక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడిన‌ట్లు స‌మాచారం. అయితే కొద్ది రోజుల క్రితం ఇడి అధికార‌లు మంత్రి నివాసం, కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిన‌దే. ఇటీవ‌ల శ్రీ‌నివాస్ అనేవ్య‌క్తి సిబిఐ నుండి వ‌చ్చాన‌ని మంత్రి ఇంటికి వెళ్లాడు. అత‌ను న‌కిలీ సిబిఐ అని తేల‌డంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం సిబిఐ అధికార‌లు మంత్రి గంగుల ఇంటికి వెళ్ల‌డం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.