ఇక నుండి సిబిఎస్ఇ టెన్త్ ప‌రీక్ష‌లు ఏడాదికి రెండుసార్లు

CBSE: 2026 నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు సంవ‌త్స‌రానికి రెండు సార్లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సిబిఎస్ఇ) వెల్ల‌డించింది. విద్యార్థుల‌పై బోర్డు ప‌రీక్ష‌ల ఒత్తిడి త‌గ్గించేందుకు వీలుగా నూత‌న జాతీయ విద్యా విధానం(NEP) సిఫార‌సు చేసింది. దీంతో ఏడాదికి రెండు సార్లు ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సిబిఎస్ ఇ ప‌రీక్ష‌ల విభాగాధిప‌తి స‌న్యం భ‌ర‌ద్వాజ్ పేర్కొన్నారు.

మొద‌టి విడ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో, రెండో విడ‌త పరీక్ష‌లు మే నెల‌లో ఉంటాయి. అయితే, మే నెల‌లో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌ను ఆప్ష‌న‌ల్‌గా పెట్టింది. తొలి విడ‌త‌లో జ‌రిగిన ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఏప్రిల్ నెల‌లో.. మే నెల‌లో జ‌రిగిన ప‌రీక్ష‌ల ఫ‌లితాలు జూన్‌లో వెల్ల‌డిస్తారు. దీంతో విద్యార్థులు మార్కులు మెరుగుప‌రుచుకునే వీలు ఉండ‌నుంది. ఈ రెండు ప‌రీక్ష‌లు పూర్తి స్థాయి సిల‌బ‌స్ తోనే నిర్వ‌హిస్తారు. ఈ విధానంపై విద్యార్ధ‌లు, త‌ల్లిదండ్రుల నుండి స్ప‌దంధన‌లు స్వీక‌రించిన అనంత‌రం బోర్డు ఈ పరీలో అమ‌లుకు సిద్ధ‌మైంది. అయితే, ఏడాదికి ఒక‌సారి అంత‌ర్గ‌త మ‌దింపు మాత్రం ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.