ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
FSI: ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి 15 టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుఉ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన వెలువరించింది. మినస్ట్రీ ఆప్ ఎన్నిరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఎఫ్ ఎఫ్ ఇ ఈ పోస్టుల ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈ నెల 30లోపు పంపించాల్సి ఉంది . ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.37,000 అందుతుంది. హెచ్ ఆర్ ఎ అదనంగా ఉంది.
ఎంపిక రాత పరీక్ష , హ్యాండ్స్-ఆన్-టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
సైన్స్ సబ్జెక్టుతో పిజి/ ఎంసిఎ/ ఎంఎస్‌సి (ఐటి/ కంప్యూటర్ సైన్స్) లేదా బిటెక్ ఐటి/ కంప్యూటర్ సైన్స్ / సివిల్ ఇంజినీరింగ్).
ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదదివి ఉన్నవారు అర్హులు. లేదా రిమోట్ సెన్సింగ్, జిఐఎస్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేయాలి. లేదా సెన్సింగ్, జిఐఎస్‌లో ఎంఎస్‌సి/ ఎంటెక్. ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్,ఫిజిక్స్ , కెమిస్ట్రి సబ్జెక్టులు ఉండాలి.
హైరెజల్యూషన్ శాటిలైట్ డాట ప్రాసెసింగ్ , ఎఐ/ ఎంఎల్, ఆర్ ఎస్/ జిఐఎస్ పరిజ్ఞానం, కోడింగ్ స్క్రిప్ట్స్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
అభ్యర్థుల వయస్సు 15.06.2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.