CBSE 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు

ఢిల్లీ (CLiC2NEWS): క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో CBSE 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను ర‌ద్దు చేస్తున్న‌ట్లు స‌ర్కార్ ప్ర‌క‌టంచింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్షత‌న జ‌రిగిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌రీక్ష‌ల కంటే.. విద్యార్థుల ఆరోగ్యం, భ‌ద్ర‌త త‌మ‌కు చాలా ప్రాముఖ్య‌మ‌ని ఈ అంశంలో ఎటువంటి రాజీ ఉండ‌ద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళ‌న నెల‌కొని ఉంద‌న్నారు. ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు బ‌ల‌వంతంగా హాజ‌రుకావొద్ద‌న్నారు.

ప్రధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కీల‌క‌ సమావేశంలో రక్షణ, కేంద్ర హోం ఆర్థిక‌, స‌మాచార‌, పెట్రోలియం, మ‌హిళా శిశుసంక్షేమ శాఖ‌ల మంత్రులతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్బిఈ) చైర్మన్ మనోజ్ అహుజా ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప‌రీక్ష‌ల ర‌ద్దుకు సంబంధించి CBSE ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏప్రిల్ 4న వాయిదా వేసిన CBSE 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.