CBSE: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ (CLiC2NEWS): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు (CBSE 12th Results) విడుదలయ్యాయి. (ఇవాళ) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ (cbseresults.nic.in)లో వీక్షించవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఈ సారి మొత్తం 13,04,561 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల కోసం రిజస్టర్ కాగా, వారిలో 12,96.318 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఓవరాల్‌గా 99.37 శాతం ఉత్తీర్ణ నమోదైంది.
అయితే, బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలురులో 99.13 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 99.67 శాతం మంది పాసయ్యారు.