సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత
హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి

చెన్నై(CLiC2NEWS) : భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడు లోని కానూరు వెల్లింగ్టన్ బేస్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న14 మందిలో రావత్ దంపతులుసహా 13 మంది మృతిచెందారు. హెలికాప్టర్లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సతీయణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నాతాధికారులు ఉన్నారు. వెల్లింగ్టన్ కాలేజ్‌లో లెక్చర్ ఇచ్చేందుకు బుధవారం ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి తమిళనాడు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాప్టర్ ప్రమాదానకి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు.