వ‌ర‌ద బాధితుల‌కు సినీ ప్ర‌ముఖుల విరాళాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS)‌‌: చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురు ఎపిలోని వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకొనేందుకు త‌మ‌వంతు విరాళాలు ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు అనేక‌మంది నిరాశ్ర‌యులైనారు. పంట‌పొలాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. ఎపిలోని వ‌ర‌ద న‌ష్టాన్ని అంచనావేయ‌టానికి కేంద్ర‌బృందాలు సహితం ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిన‌దే. జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, చిరంజీవి ఒక్కొక్కరు రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఇంకా భారీ వ‌ర్షాల కార‌ణంగా నష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని త‌మ అభిమానుల‌కు సామాజిక మాధ్య‌మాల ద్వారా పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.