గ్రూప్‌-1 ప‌రీక్ష‌లో సిఐ కుమారుడు సెల్‌ఫోన్ కాపీయింగ్..

ఒంగోలు (CLiC2NEWS): గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో ఆదివారం మొబైల్ సాయంతో కాపీయింగ్ చేస్తూ ప‌ట్ట‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప‌ల్నాడు జిల్లా కారంపూడి సిఐగా విధులు నిర్వ‌హిస్తున్న తేళ్ల చిన మ‌ల్ల‌య్య కుమారుడు శివ‌శంక‌ర్ ఆదివారం క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ప‌రీక్ష‌కు వ‌చ్చాడు. త‌న వ‌ద్ద నున్న ఐఫోన్‌తో ప్ర‌శ్నాప‌త్రాల‌ను స్కాన్ చేసి బ‌య‌ట‌కు పంపుతున్న‌ట్లు తోటి అభ్య‌ర్థులు గుర్తించారు. ప‌రీక్షా కేంద్రంలో త‌నిఖీలు ప‌క‌డ్భందీగా నిర్వ‌హించినా.. ఫోన్‌తో అతడు ఎలా లోప‌లికి వెళ్లాడ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

Leave A Reply

Your email address will not be published.