నగరంలో సెల్ఫోన్ల చోరీ ముఠా అరెస్టు..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో సెల్ఫోన్లను చోరీ చేస్తున్న కరుడుగట్టిన ముఠాను పోలీసలు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలో ఈ నెల 19 వ తేదీ అర్ధరాత్రి మసూద్ ఉర్ రెహమాన్, ఫజల్ ఉర్ రెహమాన్లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు విలాసాలకు అలవాటుపడి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోకూడా ఇతని పై కేసులున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి ద్విచర్కవాహనం, మారణాయుధాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జూన్ 19వ తేదీన మసూద్ , ఫజల్ కలిసి చాదర్ఘాట్లో బైక్ చోరీ చేశారు. అనంతరం సికింద్రాబాద్ గణేష్ ఆలయం సమీపంలో స్టేషన్వైపు వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి సెల్ఫో చోరీ చేసేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ప్రతిఘటించగా.. కత్తిలోబెదిరించాఇ ఫోన్ లాక్కెళ్లురు. బాధితుడు సాయం కోసం కేకలు వేయగా.. యాంటీ స్నాటింగ్ టీమ్ నిందితులను
వెంబడించింది. ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయినా సరే వారు మరో చోరీ కి యత్నించారు. ఆ సమయంలో నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మసూద్ కాలిలో బులెట్ దిగింది. పరారైన నిందితులను 48 గంటల్లో పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.