రాబోయే నెలల్లో పెరగనున్న సిమెంట్ ధరలు!
ఢిల్లీ (CLiC2NEWS): సిమెంట్‌కు డిమాండ్ పెరగడంతో రానున్న కాలంలో సిమెంట్ ధరలు పెరగనున్నట్లు సమాచారం. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 5% పెరుగుతుందని , దీంతో కంపెనీలు సిమెంట్ ధరలను పెంచే అవకాశమున్నట్లు Centrum నివేదిక తెలిపింది. సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వ వ్యయం ఆలస్యం కావడం, రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉండటం, దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో పాటు అనేక అంశాలు డిమాండ్‌కు ప్రతికూలంగా ఉంది.
దక్షిణ భారతదేశంలో డిమాండ్ ఏకీకరణ, ఉత్తర భారతదేశంలో అధిక వినియోగం వల్ల 2024-25 ఆర్థికి సంవత్సరం 3,4 త్రైమాసికాల్లో సిమెంట్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్ కంపెనీలు 5% వృద్దిని నమోదు చేసే అవకాశముందని Centrum నివేదిక వెల్లడించింది