ఎపి అదనంగా రూ. 3,716 కోట్లు అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా రూ. 3,716 కోట్లు అప్పు చేసేందుకు అనుమతి లభించింది. దేశంలోని పది రాష్ట్రాలకు అదనంగా అప్పులు చేసుకొనేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా రూ. 3,716 కోట్లు అప్పు చేసేందుకు అనుమతి లభించింది. అమలవుతున్న సబ్సిడీ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాలతో డిస్కంలు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎక్కువ వ్వవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలు నష్టాలను అరికట్టడానికి వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేశాయి. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఎఫ్ ఆర్‌బిఎం పరిమితి అరశాతం పెంచినట్లు సమాచారం.