అమ‌రావ‌తికి కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం

ఢిల్లీ (CLiC2NEWS): ఎపి ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. అమ‌రావ‌తికి కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీట‌ర్ల మేర రైల్వేలైన్ .. హైద‌రాబాద్ , కోల్‌క‌తా, చెన్నై స‌హా దేశంలోని ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల‌తో రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుతుంది. ఈ కొత్త ప్రాజెక్టుకు రూ.2,245 కోట్ల అంచనా వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న‌ట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన‌వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీట‌ర్ల పొడ‌వైన వంతెన నిర్మాణం చేప‌ట్టనున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు బిహార్‌లో రూ.4,553 కోట్ల వ్య‌యంతో రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్ 250 కిలోమీట‌ర్ల పొడ‌వుతో యుపి, ఉత్త‌ర బిహార్‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

Leave A Reply

Your email address will not be published.