ఎన్‌డీఏలో మహిళల ప్రవేశాలకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ (CLiC2NEWS): నేషనల్‌ ఢిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. త్రివిధ ద‌ళాల అధిప‌తుల‌తో చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి తగిన సమయం అవసరమని కేంద్రం పేర్కొంది. గ‌తంలో ఎన్డీఏ పరీక్షలకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు లో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మహిళలను ఎన్‌డీఏ పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్ల‌డించింది.

సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ` గ‌త విచార‌ణ‌లోనే ఈ నిర్ణ‌యం తీసుకుంటే మేం జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. మీరేం చేస్తోరో.. భ‌విష్య‌త్‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో మీరు ఒక అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌లి` అని కేంద్రానికి సూచించింది.

దీనిపై అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి, బుధవారం కోర్టుకు వివరణ ఇస్తూ…. “నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ), నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ ఇవ్వాలని కేంద్రం, త్రివిద దళాలు అంగీకరించాయి. ఇది చాలా గొప్ప వార్త. దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్‌ని అందజేస్తాం.` అని ధర్మాసనాన్ని కోరారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సాయుధ దళాలలు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో తమకెంతో ఆనందం కలిగించిందని జస్టీస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టీస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.