గుడ్‌న్యూస్..ఉచిత రేషన్ సరఫరా మార్చి వరకు పొడిగించిన కేంద్రం

ఢిల్లి (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం గతేడాది అమలులోకి తీసుకొచ్చిన ఉచిత రేషన్ స్కీమ్‌ను వచ్చే ఏడాది వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వలన ప్రజల యెక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం క్రితం సంవత్సరం ప్రధార మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (PMGKAY) కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీ చేస్తుంది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతున్న విషయం తెలిసినదే. ఈ ప్రక్రియ మరో నాలుగు నెలలు పాటు అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఇటీవల పరిస్థితులు మెరుగుపడటంతో నవంబర్ 30వ తేదీ నుండి ఉచిత రేషన్ పంపిణీని నిలిపివేయనున్నట్టు నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని పొడిగించాలని ‘రైట్ టు ఫుడ్’ కార్యకర్తలు సహా పలు పార్టీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్యాబినెట్ వచ్చే ఏడాది మార్చి వరకూ పథకాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.