అన్న‌దాత‌ల‌కు కేంద్రం శుభ‌వార్త‌.. వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

ఢిల్లీ (CLiC2NEWS): రైతుల‌కు కేంద్రం శుభావార్త తెలిపింది. 2022-23 ఖ‌రీఫ్ సీజ‌న్‌కు ప‌లు ర‌కాల పంట‌ల‌పై క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పెంపున‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించింది. ఈమేర‌కు బుధ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆర్ధిక వ్య‌వ‌హారాల కేబినేట్ క‌మిటీ మొత్తం 14 పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను పెంచేందుకు ఆమోదం తెలిపింది.

సాధార‌ణ వ‌రి క్వింటాల్ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను రూ. 100 పెంచారు.

నువ్వుల కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌పై నైజ‌523 పెరిగింది.

పెస‌ర్ల‌పై కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ. 480 ఎంఎస్‌పి పెంచారు.

పొద్దుతిరుగుడు విత్త‌నాల కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ. 385 పెరిగింది.

మినుముల‌పై కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ.300పెంచారు.

మ‌ధ్య ర‌కం ప‌త్తి కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌పై రూ. 354 పెరిగింది.

సోయాబీన్ మ‌ద్ద‌తు ధ‌ర‌ను క్వింటాల్‌పై రూ. 350 పెరిగింది

కందుల కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ. 300 పెరిగింది.

హైబ్రిడ్ జొన్నల కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌పై రూ. 232 పెరిగింది.

స‌జ్జ‌ల కనీస మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ. 100 పెరిగింది.

మొక్క‌జొన్న మ‌ద్ద‌తు ధ‌ర‌ను క్వింటాల్‌పై రూ. 92 పెంచారు.

 

 

Leave A Reply

Your email address will not be published.