ప‌త్తిపాక మోహ‌న్‌, నాగ‌రాజులకు కేంద్ర సాహిత్య పుర‌స్కారాలు

ఢిల్లీ (CLiC2NEWS): సిరిసిల్ల వాసి, నేష‌న‌ల్ బుక్ ట్ర‌స్ట్ తెలుగు సంపాద‌కుడు, ప్ర‌ముఖ క‌వి   డా. ప‌త్తిపాక మోహ‌న్‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ-2022 బాల పురస్కారం వ‌రించింది. అదేవిధంగా తిరుప‌తి జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, యువ క‌వి అయిన ప‌ళ్లిప‌ట్టు నాగ‌రాజు యువ పుర‌స్కారంకు ఎంపిక‌య్యాడు. ‘బాల‌ల తాతా బాపూజీ’ అనే క‌వితా సంక‌ల‌నానికి గాను మోహ‌న్ బాల పుర‌స్కారానికి, ‘యాలై పూడ్సింది’ అనే క‌వితా సంక‌ల‌నానికి గాను నాగ‌రాజు యువ పుర‌స్కారానికి  ఎంపిక‌య్యారు. కేంద్ర సాహిత్య అకాడ‌మీ 2022కి సంబంధించి బాల, యువ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. దేశంలోని 22 భాష‌ల‌లో జ్యూరి ఎంపిక చేసిన ర‌చ‌న‌ల‌కు ఈ అవార్డులు ప్ర‌క‌టించింది. సాహిత్య పుర‌స్కారాలు న‌వంబర్ 14వ తేదీన ఢిల్లీలో అంద‌జేస్తారు.

Leave A Reply

Your email address will not be published.