IND vs AUS: భారత్ లక్ష్యం 265..

దుబాయ్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా మంగళవారం సెమీ ఫైనల్‌లో భారత్ , ఆస్ట్రేలియాతో తలపడుతోంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 49.4 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటయింది. స్టీవ్ స్మిత్ 73 , అలెక్స్ 61 పరుగులు సాధించారు. హెడ్ 39 పరుగులు తీయగా.. మార్నస్ 29 పరుగులు చేశారు. షమీ 3 వికెట్టు తీయగా.. జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. పటేల్, హార్దిక్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకొని కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు (335) పట్టిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. తర్వాతి స్థానాల్లో ద్రవిడ్ (335), అజహరుద్దీన్ (261), సచిన్ (256) ఉన్నారు.