భారత్, న్యూజిలాండ్ ఫైనల్ పోరు..

దుబాయ్ (CLiC2NEWS): దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ – న్యూజిలాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్దమయ్యాయి. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గి టీమ్ ఇండియా జట్టు రెట్టింపు ఉత్సాహంతో ట్రోఫీని దక్కించుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో టాస్ నెగ్గి ముందుగా న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
మిచెల్ 63 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34, పరుగులు చేశారు. మ్యాచ్ చివరిలో బ్రాస్‌వెల్ 53* పరుగులతో మెరిశాడు. 252 పరుగుల లక్ష్యంతో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది.