ఛాంపియ‌న్స్ ట్రోఫి.. భార‌త్ vs పాక్‌

IND vs PAK: దుబాయి వేదిక‌గా భార‌త్ , పాకిస్థాన్ మ‌ధ్య ఛాంపియ‌న్ ట్రోఫి మ్యాచ్ కొన‌సాగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జ‌ట్టు నిర్ణీత 49.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగులకు ఆలౌట‌యింది. సౌద్ ష‌కీల్ 62, మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 46 ప‌రుగులు తీశారు. భార‌త బౌల‌ర్లు కుల్ దీప్ యాద‌వ్ 3 వికెట్లు.. హార్దిక్ పాండ్య 2, అక్ష‌ర్ ప‌టేల్ , ర‌వీంద్ర జ‌డేజా, హ‌ర్షిత్ రాణా త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.ఈ మ్యాచ్ లో కోహ్లీ రికార్డు సొంతం చేసుకున్నాడు. వ‌న్డేల్లో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక క్యాచ్‌లు 157 ప‌ట్టిన ఆట‌గాడుగా అజ‌హ‌రుద్దీన్ (156)ని అధిగ‌మించాడు. ఇక దాయ‌దుల మ‌ధ్య పోరును వీక్షించేందుకు ప్ర‌ముఖ‌ సినీ నటులు , రాజ‌కీయ నాయ‌కులు సైతం స్టేడియంలో సంద‌డి చేశారు. న‌టులు చిరంజీవి, ద‌ర్శ‌కుడు సుకుమార్‌, ఎపి మంత్రి నారా లోకేశ్‌, ఎంపి చిన్ని కృష్ణ తదిత‌రులు రావ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.