పాక్‌పై కివీస్ 60 పరుగుల తేడాతో విజయం

ఇస్లామాబాద్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టా విజయం సాధించింది. కివీస్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి.. 320 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటయింది.
ఇక గురువారం భారత్ , బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫిలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సెమీస్‌కు చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. 2017లో ఛాంపియన్స్ ట్రోఫి సీజన్‌లో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ అద్భుతమైన విజయాన్ని అందించారు. రోహిత్ 123 పరుగులు చేయగా.. కోహ్లీ 96 తీశాడు. మరోసారి వీరిద్దరి ద్వయం బంగ్లాపై అలాంటి ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.