ఎపిలో భారీ వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్నం (CLiC2NEWS): తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుకురి సే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. 4, 5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.