చాందీపురా వైరస్.. గుజరాత్‌లో 28 మంది చిన్నారులు మృతి
గాంధీనగర్ (CLiC2NEWS): గుజరాత్‌లో చాందీపురా వైరస్ బారిన పడి 14 ఏళ్ల లోపు చిన్నారులు 28 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 164 మెదడు వాపు కేసులు ఉండగా.. వీటిలో 61 కేసులు చాందీపురా వైరస్ వల్ల వచ్చినవేనని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిశికేశ్ పటేల్ వెల్లడించారు. తమ రాష్ట్రంలో జులైలో తొలి కేసు నమోదైందని, ఇప్పటివరకు 28 మంది మృతి చెందినట్లు తెలిపారు. మెదడు వాపు వ్యాధితో 101 మంది చనిపోగా.. వారంతా 14 ఏళ్లలోపు వారే ఉన్నారన్నారు.
గత వారం నుండి రాష్ట్రంలో కొత్త కేసులు రాలేదని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్ బయోటెక్నాలజి రిసెర్చ్ సెంటర్ (జిబిఆర్‌సి) ద్వారా మెదడువాపు వ్యాధికి కారణమై చిన్నారుల్ని బలితీసుకున్న చాందీపురా వైరస్‌తో పాటు ఇతర వైరస్‌నలు గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.