కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి (CLiC2NEWS): తెలుగుదేశం + జనసేన + బిజెపి కూటమి శాసన సభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం విజయవాడలో కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ను కూటమి శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ భేటీలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రాతిపాదించగా.. కూటమి ఎమ్మెల్యే్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తదుపరి కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికైనట్లు టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. బుధవారం ఉదయం గం. 11.27 లకు ఆంధ్రప్రదేశ్ సిఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.