గత ఐదేళ్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడి తప్పింది: సిఎం చంద్రబాబు
ఢిల్లీ (CLiC2NEWS): గత ఐదేళ్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయిందని.. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని సిఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్ర ఆర్ధిక అవసరాలపై మెమోరాండాన్ని ఆమెకు అందజేశారు. సుమారు గంటపాటు వివిధ అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయింపులు ఎందుకు పెంచాలో మెమోరాండంలో వివరించారు. పలు ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందించాలని, పోలవరం, అమరావతితో పాటు వెనుకపడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. సిఎం విజ్ఞప్తి పై మంత్రి సానుకూలంగా స్సదించినట్లు సమాచారం. వీలైనంత వరకు కేంద్రం నుండి ఆర్ధిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారమాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌రాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్‌డిఎ ఎంపీలు పాల్గొన్నారు.