నరేంద్ర మోడీతో చంద్రబాబు, పవన్ భేటీ..

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్‌డిఎ పక్షనేతగా నరేంద్రమోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జిపి నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ , చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నితీశ్ కుమార్ , ఏక్‌నాథ్ శింబే, హెచ్‌డి.కుమారస్వామి, చిరాగ్ సాసనాన్ తదితర నేతలు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం చివరి కేబినేట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తుంది. మనమంతా సమిష్టిగా కృషి చేస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చని.. ఇదే ప్రజలకు మోడీ హామీ అని అన్నారు. ఈరోజు ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు అందజేశారు.