జెండాలు వేరైనా అజెండా ప్రజా క్షేమమే.. చంద్రాబాబు
చిలకలూరి పేట (CLiC2NEWS): టిడిపి , జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోడి హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డిఎదని ఇందులో ఎవరికీ అనుమానం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, మమ్మల్ని ఆశీర్వదించాలన్నారు. మా జెండా వేరే కావచ్చు.. మా అజెండా ఒక్కటే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చంద్రబాబు అన్నారు. ప్రజలు కోసం తపించే పవన్ కల్యాణ్ కు అభినందనలు. మోడీగారు ఒక వ్యక్తికాదు.. భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి అని, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అన్నారు.
బంగారంలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్లో చీకటిమయం చేశారని, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అభివృద్ది లేదని.. ప్రజలకు మనశ్శాంతి లేకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించిన వారిని ఆణచివేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన బాధ్యత మనదని చంద్రబాబు పిలుపునిచ్చారు.