76 లక్షల సభ్యత్వాల నమోదుతో చరిత్ర సృష్టించాం: సిఎం చంద్రబాబు
అమరావతి (CLiC2NEWS): పార్టిపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని, 76 లక్షల సభ్యత్వాల నమోదుతో దేశంలోనే చరిత్ర సృష్టించామని సిఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు టిడిపిలో సభ్యులుగా చేరాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 76,89,103 మంది పార్టి సభ్యత్వం తీసుకున్నారన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టిడిపికి ఉందని.. అది మెంబర్ షిప్ ద్వారా మరోసారి నిరూపితమైందని స్పష్టం చేశారు. గురువారం పార్టి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు , కార్యకర్తలతో సిఎం టిలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ. 135 కోట్లు పార్టి శ్రేణులకు ఖర్చు చేసినట్లు.. రూ. 100 సభ్యత్వంతో రూ.5లక్షల బీమా అందించే ఏకైక పార్టి టిడిపి అని సిఎం తెలిపారు.