సిఐడి క‌స్ట‌డీకి చంద్ర‌బాబు: ఎసిబి కోర్టు

విజ‌య‌వాడ (CLiC2NEWS): స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్ర‌బాబును రెండు రోజుల‌పాటు సిఐడి క‌స్ట‌డీకి అనుమ‌తిస్తూ ఎసిబి కోర్టు తీర్పునిచ్చింది. చంద్ర‌బాబును పోలీసు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని సిఐడి విజ‌య‌వాడ ఎసిబి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం రెండ్రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తించింది. సిఐడి ఐదు రోజుల క‌స్ట‌డీకి కోర‌గా.. న్యాయ‌మూర్తి రెండ్రోజుల విచార‌ణ‌కు అనుమ‌తించారు. విచార‌ణ అధికారుల పేర్లు ఇవ్వాల‌ని, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులోనే విచార‌ణ చేయాల‌ని, న్యాయ‌వాదుల స‌మ‌క్షంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఉద‌యం 9.30 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు విచార‌ణ‌కు అనుమ‌తించారు.

Leave A Reply

Your email address will not be published.