అక్టోబర్ 19వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు..

విజయవాడ (CLiC2NEWS): స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఎసిబి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలులో ఉన్న చంద్రబాబు రిమాండ్‌ను ఇప్పటికే పొడిగించిన సంగతి తెలిసిందే ఆ గడువు గురువారంతో ముగియనుంది. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఎసిబి కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. దీంతో ఈ నెల 19వ తేదీ వరకు మరోసారి రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడి పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం విచారణ కొనసాగనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.