కుప్పంలో చంద్రబాబు విజయం

తెలుగుదేశం పార్టి అధినేత చంద్రబాబు కుప్పం నుండి 48 వేల ఓట్ల మెజారిటితో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి .. వైఎస్ ఆర్‌సిపి అభ్యర్థి కెఆర్‌జె భరత్‌పై 48,184 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అనూహ్యమైన విజయం సాధిస్తున్నది. ఎన్‌డిఎ కూటిమిగా పోటిచేసిన టిడిపి, జనసేన, బిజెపి కలిపి 165 స్థానాలు గెలుచుకోనుంది.