Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి రోవ‌ర్‌

శ్రీ‌హ‌రికోట (CLiC2NEWS): విజ‌య‌వంతంగా చంద్రుడిపైకి దిగిన భారత్ విక్ర‌మ్ ల్యాండ‌ర్, ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్ త‌మ‌కు ఇచ్చిన ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి విశ్రాంతికి సిద్ధ‌మ‌య్యాయి. దీనిలో భాగంగా ముందుగా ప్ర‌జ్ఞాన్ ను స్లీప్ మోడ్‌లోకి పంపివేసిన‌ట్లు శ‌నివారం రాత్రి ఇస్రో ప్ర‌క‌టించింది. శ‌నివారం ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్ మట్లాడుతూ.. ల్యాండర్ చుట్టూ 100 మీటర్ల మేర రోవ‌ర్ ఇప్ప‌టి వ‌వ‌ర‌కు ప్ర‌యాణించింద‌ని తెలిపారు. అందులోని రిసివ‌ర్‌ను ఆన్‌లోనే ఉంచి, పేలోడ్స్‌ను ఆఫ్ చేసి ఉంచుతామ‌ని తెలిపారు. అలాగే ప్ర‌స్తుతం వీటిలోని బ్యాట‌రీ పూర్తి స్థాయిలో చార్చి అయి ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ నెల (సెప్టెంబ‌రు) 22వ తేదీన తిరిగి ఆ ప్రాంతంలో సూర్య కిర‌ణాలు ప్ర‌స‌రించిన త‌ర్వాత తిరిగి వాటికి బాధ్యత‌లు అప్ప‌గిస్తామ‌ని సోమ‌నాథ్ తెలిపారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన చోట సాయంకాలం మొద‌లైంది. అక్క‌డ వెలుతురు త‌గ్గ‌నుంది. ఆ ప్రాంతంలో 14 రోజుల పాటు రాత్రి స‌మ‌యం మొద‌లు కానుంది. దాంతో ఆ ప్రాంలో వెలుగు తగ్గుతాయ‌ని సోమ‌న్‌నాథ్ తెలిపారు. భార‌త్ ప్ర‌తినిధిగా రిసీవ‌ర్ ఎప్ప‌టికి అక్క‌డే ఉంటుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.