వెస్ట్‌బెంగాల్ పేరు ‘బంగ్లా’గా మార్చండి.. మమతా బెనర్జీ
కోల్‌కతా (CLiC2NEWS): పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని .. సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు చివరివరకు వేచి ఉండాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాంబే పేరును ముంబయిగా, ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చారు. మరి మా రాష్ట్ర పేరు ఎందుకు మారడంలేదని ఆమె ప్రశ్నించారు. పేరు మార్పుపై రాష్ట్ర అసెంబ్లీ గతంలోనే బిల్లును ఆమోదించిందని, దానికి సంబంధించి మేం అన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చామని తెలిపారు. కానీ ఇప్పటివరకు రాష్ట్రం పేరు మాత్రం బంగ్లాగా మారలేదన్నారు.