చరణ్, ఎన్టీఆర్ `నాటు` డ్యాన్స్ అదిరింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి నిర్మిస్తున్న మూవీ ‘ట్రిపుల్ ఆర్’ లో ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడంతో సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలను నమోదు చేసుకుంది.
2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ ను విడుదల చేసింది.
‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు…’
అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.
రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.